సిద్దిపేట, జూన్ 1 : క్రీడాకారులు పట్టుదలతో సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట స్పోర్స్ హబ్‌లో రూ.కోటి 80 లక్షలతో జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఫుట్‌బాల్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. స్పోర్స్ హబ్‌గా సిద్దిపేటను తీర్చిదిద్దుతున్నామన్నారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎదిగే పిల్లలకు క్రీడలు ఎంతో అవసరమన్నారు.
వివిధ క్రీడల్లో గెలుపొందిన వెయ్యి మంది క్రీడాకారులు, కోచ్‌లను అభినందించారు. ఉత్తమ ప్రతిభ చూపి రాణిస్తే, ఫుట్‌బాల్ స్టేడియంలో మరిన్నిసౌకర్యాలు కల్పిస్తామన్నారు. జాతీయ స్థాయి ఫుట్‌బాల్ జట్టులో రాణిస్తున్న క్రీడాకారిణి సౌమ్య మాట్లాడుతూ ఐదేండ్లుగా మంచి గ్రౌండ్ కోసం చూసినా దొరకలేదన్నారు. ఈ స్టేడియం చాలా బాగుందని, మంత్రి హరీశ్‌రావు ఉండడం ఇక్కడి క్రీడాకారుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని, పట్టుదల, లక్ష్యంతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. బుధవారం పట్టణంలోని వడ్డెపల్లి దయానంద్ ఫంక్షన్ హాల్లో ప్రతిభ డిగ్రీ ,పీజీ కళాశాలకు ఐఎస్వో సర్టిఫికెట్ జెండర్ సెన్సిటైజేషన్ సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్‌కు మంత్రి హరీశ్‌రావు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు సర్టిఫికెట్లు రావడం అరుదని, కళాశాల విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే వ్యక్తి సూర్యప్రకాశ్ అని అన్నారు. ఫిజిక్స్ ప్రతినిధులు తన వద్దకు వస్తే, డిజిటల్ ఫిజికల్ క్లాసులు ఉచిత శిక్షణకు ప్రతిభ డిగ్రీ కళాశాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. సివిల్ సర్వీస్‌లో టాప్ 100లో 11సీట్లు తెలంగాణకు వచ్చాయని, కొండపాక గ్రామానికి చెందిన అఖిల్ యాదవ్ ఇంట్లోనే కూర్చొని, చదివి ఐఏఎస్ ర్యాంక్ సాధించారని తెలిపారు.
2ఐ ఫోకస్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తానని తెలిపారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని రెండో వార్డుకు చెందిన నలుగురు దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సాగు నీటి ప్రాజెక్టుల కాల్వలు, మైనర్ కాల్వలను తొలి ప్రాధాన్యంగా తీసుకొని భూసేకరణ చేయాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఈఎన్సీ హరిరామ్, సిద్దిపేట ఇన్చార్జి ఆర్డీవో జయచంద్రారెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ఈ బస్వరాజ్, ఇరిగేషన్ అధికారులతో సాగు నీటి కాల్వల భూసేకరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగనాయక సాగర్ కుడి ప్రధాన కాల్వ ద్వారా మైనర్స్, డి్రస్ట్రిబ్యూటరీ కాల్వలు ఎల్డీ-4 నుంచి 10 వరకు కాల్వల అంశాలపై , భూసేకరణ ఆవశ్యకత క్షేత్రస్థాయిలో సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
రంగాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా లింకేజీ ప్యారలాల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌పై ఆరా తీసి భూసేకరణ త్వరగా చేయాలన్నారు. కుడి కాల్వ మైనర్ కాల్వ నిర్మాణం కోసం 41 కి.మీటర్లు భూసేకరణ చేసామని అధికారులు మంత్రికి వివరించారు. రైతులు పంటలు వేసుకుంటే తిరిగి భూమి తీసుకుంటే వారిని ఇబ్బంది పెట్టిన వారిమి అవుతామని, అలాంటి ఇబ్బందులు రాకముందే కాల్వలు ఎందుకు తవ్వలేదని కాంట్రాక్టర్ల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నంగునూరు మండలం పెద్దవాగును ఎల్డీ-10తో నీళ్లు నింపడం కోసం వాగవతలి గ్రామలైన అక్కెనపల్లి, ఘనపూర్, గట్లమల్యాల, ఖాతా గ్రామాలకు ఏ విధంగా నీళ్లు ఇవ్వవచ్చో డిజైన్ చేసి ఆగస్టులోపు పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట అర్బన్, జూన్ 1 : ప్రజలు నమ్మేది ఒక్కటే ఎల్ఐసీని.. ఎల్ఐసీ అంటే నమ్మకం, విస్వసనీయతకు మారుపేరు.. అలాంటి ఎల్ఐసీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తామని అనడం చాలా బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణం బ్యాంకు స్ట్రీట్‌లో ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీస్ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
సిద్దిపేటలో ఎల్ఐసీ నూతన బ్రాంచ్ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 15 ఏండ్ల నుంచి చేసిన ప్రయత్నం ఇవాళ రూపుదిద్దుకున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ మినీ ఐపీయి, జోనల్ మేనేజర్ జగన్నాథ్, చీఫ్ ఇంజినీర్ వినీత్వాత్సవ్, రీజినల్ మేనేజర్ మురళీధర్, సికింద్రాబాద్ డివిజన్ మేనేజర్ రామయ్య, స్థానిక ప్రజాప్ర తినిధులు పాల్గొన్నారు.