ఝరాసంగం, మే 30: కేతకీ క్షేత్రం జనసంద్రంగా మారింది. సోమవారం అమావాస్య కావడంతో సంగమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. తెల్లవారుజాము నుంచే అమృత గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మరికొంత మంది భక్తులు కోడెలను సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కాగా, బొప్పన్పల్లి గ్రామానికి చెందిన భక్తుడు బగ్లీ సంగారెడ్డి భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు.