పటాన్చెరు, మే 27 : కార్మికుల పక్షపాతి టీఆర్ఎస్కేవీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బండ్లగూడలోని పెన్నార్ ఇండస్ట్రీస్‌లో వేతన ఒ ప్పందం కుదిరింది. టీఆర్ఎస్కేవీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పరిశ్రమ యాజమాన్యంతో జరిగిన చర్చ ల్లో కార్మికులకు రూ. 5,200 వేతనం పెంచేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కార్మికుల తరఫున ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్కేవీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాం బాబు యాదవ్, అడ్వైజర్ కిష్టయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ యదగిరియాదవ్, కంపెనీ ప్రతినిధులు డైరెక్టర్ లావణ్యకుమార్, హెచ్ఆర్ మేనేజర్ సత్యనారాయణ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అన్ని రకాల పెండింగ్ బకాయిలతో పాటు, సర్వీస్ వెయిటేజీ, వేరియబుల్ పర్ఫామెన్స్ అలవెన్స్ రూ. 100 ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.
ఎడ్యుకేషన్ లోన్ రూ. 30వేలు ఇచ్చేందుకు, రెండున్నర లక్షల రూపాయల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ చేయించేందుకు అంగీకరించారు. వీటితో పాటు పలు రకాల బెనిఫిట్స్‌కు యాజమాన్యం అంగీకరించింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్నార్‌లో గతంలోకంటే ఇప్పుడు చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందన్నారు. కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చేందుకు యాజమాన్యంతో పోరాడి ఒప్పందం చేసుకున్నామన్నారు. కార్మికుల మొహాల్లో ఆనందం చూడాలనేది తమ లక్ష్యమన్నారు. టీఆర్ఎస్కేవీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు మాట్లాడు తూ కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
పటాన్చెరు, మే 27 : నిరుపేదల పాలిట సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు సంజీవనిలా ఆదుకుంటున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 71మంది లబ్ధిదారులకు రూ.30.25 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా వందలాది మందికి నాణ్యమైన చికిత్సలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సీఎం రిలీఫ్‌ఫండ్స్ చెక్కుల జారీకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి ప్రజల ప్రాణాలకు రక్షణ క ల్పించారని కొనియాడారు. కార్పొరేట్ వైద్యానికి సీఎం రిలీఫ్‌ఫండ్ అండగా నిలుస్తున్నదన్నారు. ఎవరికి వైద్య చికిత్సకు ఇబ్బంది ఉన్నా తన క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మండల పరిధిలోని 14మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను సైతం అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, ఎంపీపీలు దేవానంద్, ప్రవీణ విజయభాస్కర్‌రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, అమీన్పూర్ తహసీల్దార్ విజయ్‌కుమార్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, పరమేశ్‌యాదవ్, రాజేశ్, షేక్ హుస్సేన్, రవికుమార్, శ్రీను పాల్గొన్నారు.
జిన్నారం, మే 27 :అనారోగ్యంతో దవాఖానల్లో చికిత్స పొందిన 11 మంది బాధితులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. మొత్తం రూ.3,83,500ల విలువైన 11 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే పటాన్‌చెరులోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, సర్పంచ్‌లు ఆంజనేయులు, సరితాసురేందర్‌గౌడ్, శెట్టి శివరాజ్, నాయకులు కప్పెర మహేశ్ పాల్గొన్నారు.
గుమ్మడిదల,మే27: ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలను నిర్వహించారు. శుక్రవారం మండలంలోని అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మతల్లి గ్రామదేవత మందిరంలో అమ్మవారిని రుత్వికులు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామదేవతల ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుందన్నారు.
ముత్యాలమ్మ గ్రామదేవత మందిరాన్ని నిర్మించిన గ్రామస్తులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకం తిరుమలవాసు, ఉపసర్పంచ్ మురళి, ఎంపీటీసీ బీ.లక్ష్మి, ఈపీ కార్యదర్శి వినోద్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మహ్మద్‌హుస్సేన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు రుక్మారెడ్డి, టీఆర్ఎస్ మండల యువత నాయకుడు నరహరి, విగ్రహ దాత యంజాల సంజీవరెడ్డి, నాయకులు దుర్గాభిక్షపతి, బాలకిషన్, శేఖర్‌గౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
జిన్నారం, మే 27 : నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని అండూరు గ్రామంలో శుక్రవారం పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో దైవారాధన మనుషులను, మనసులను స్థిరంగా ఉంచుతుందన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న ఆలయాల నిర్మాణాలకు తనవంతు సహకారం అందిస్తున్న ట్లు చెప్పారు.
అమ్మవారి దయతో ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఆలయం పది కాలాల పాటు నాణ్యతగా ఉండేలా నిర్మించాలని, మన భవిష్యత్తు తరాలు మనల్ని గుర్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ ఖదిర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఊట్ల సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు వై.ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ పంతులు పాల్గొన్నారు.