పటాన్చెరు, ఆగస్టు 21: కృష్ణతత్వమే ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి పటాన్చెరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా కార్పొరేటర్ మెట్టుకుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వహించారు. యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకృష్ణుడికి ప్ర త్యేక పూజలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ శ్రీకృష్ణుడు జగద్గురు అని పేర్కొన్నారు. పటాన్చెరులో ఏటా నిర్వహించే వేడుకలు భక్తిని పెంచుతున్నాయన్నారు. శోభాయాత్రలో పాల్గొనడం తనకు ఎం తో సంతోషాన్ని కల్గిస్తున్నదన్నారు. నిర్వాహకులు కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని ఎమ్మెల్యే వారిని అభినందించారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మె ట్టు కుమార్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్, విజయ్‌కుమార్, గూడెం మధుసూదన్‌రెడ్డి, మెరాజ్‌ఖాన్, రవి పాల్గొన్నారు.
పటాన్చెరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసి న శోభాయాత్రలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్‌ను ఆహ్వానకమిటీ సత్కరించింది.
గుమ్మడిదల, ఆగస్టు 21: మంబాపూర్లో నిర్వహించిన అలీ అబ్బాస్ జాతర ఉత్సవాలకు ఆదివారం ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ప్రజాప్రతినిధులతో కలిసి పీర్లకు దట్టిలు పూలు సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏటా నిర్వహించే అలీ అబ్బాస్ ఉత్సవాలు హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
కార్యక్రమంలో ఎంపీపీ సద్ధి ప్రవీణ, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్, సీనియర్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్,నర్సింహారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.