చేర్యాల, ఆగస్టు 21 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తుల నామస్మరణంతో మార్మోగింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. 20 వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.
శనివారం సాయంత్రం నుంచి కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామివారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టారు.
కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. భక్తులకు సేవలందించిన వారిలో ఏఈవో వైరాగ్యం అం జయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు ఉన్నారు.