కౌడిపల్లి, ఆగస్టు 21: మండల కేంద్రమైన కౌడిపల్లిలో గౌడసంఘం ఆధ్వర్యంలో నూతనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణం పూర్తికాగా, గౌడ సంఘం గ్రామాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. వేదఆదివారం ఉత్సవాలకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గౌడసం ఘం రాష్ట్ర నాయకులు దుర్గప్పగారి అశోక్‌గౌడ్, ప్రజాప్రతినిదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.