వెల్దుర్తి, ఆగస్టు 17 : ప్రతి వ్యక్తికి విద్యతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి పేర్కొ న్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు ఎంపీపీ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. క్రీడల తో శారీరక ధృడత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, శ్రద్ధ్ద పెరుగుతుందన్నారు.
క్రీడల్లో అలవర్చుకునే స్నేహభావం, పోరాడేతత్వం జీవితంలో ఎదగడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ పోటీల్లో పతకాలను సాధిస్తున్న వెల్దుర్తి పాఠశాల విద్యార్థులతోపాటు శిక్షణ ఇచ్చిన పీడీ ప్రతాప్‌సింగ్, సహకరించిన ఉపాధ్యాయులను ఎంపీపీ అభినందించారు.
కార్యక్రమంలో ఎంఈవో యాదగిరి, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ వెంకటేశం, హెచ్ఎం సాంబ య్య, ఎస్జీటీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశం, సర్పంచ్ లు వెంకటలక్ష్మి, మల్లేశంగౌడ్, నాయకులు నరేందర్‌రెడ్డి, కృష్ణాగౌడ్, శాఖారంశ్రీను, గంగాధర్ పాల్గొన్నారు. కుకునూర్ గ్రామానికి చెందిన పోచమ్మకు మంజూరైన రూ. 40వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును వెల్దుర్తిలో బస్వాపూర్ సర్పంచ్ మల్లేశంగౌడ్కు అందజేశారు. సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలను ఆదుకుంటున్నారని అన్నారు.
నర్సాపూర్, ఆగస్ట్టు 17 : జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో నర్సాపూర్ పట్టణానికి చెందిన గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 8వ తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా పోటీలు మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగాయి. క్రీడల్లో పాఠశాలకు చెందిన అశోక్ అండర్- 14 లో షార్ట్ఫుట్ మొదటి, లాంగ్‌జంప్‌లో 3వ స్థానం సాధించ గా, 600 మీటర్ల పరుగు పందెంలో విద్యార్థి బాలు 3వ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ రామ్మోహన్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీఈటీ రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.
పెద్దశంకరంపేట, ఆగస్టు 17 : మండలస్థాయి క్రీడా పో టీలను ఎంపీపీ జంగం శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, సర్పంచ్ రాము లు, మాజీ ఎంపీటీసీలు సుభాశ్‌గౌడ్, వేణుగోపాల్‌గౌడ్, నాయకులు నరేశ్, శ్రీశైలం, సుభాష్, మానయ్య ఉన్నారు.
హవేళీఘనపూర్, ఆగస్ట్టు 17 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడాకారులను స్థానికులు ప్రోత్సహించాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మం డల కోఆప్షన్ సభ్యుడు ఖాలేద్, ఎంపీడీవో శ్రీరామ్, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, యామిరెడ్డి, చెన్నాగౌడ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.