కొల్చారం/ నర్సాపూర్/ చేగుంట, మే 27 : పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్రప్రభుత్వాన్ని సీపీఎం డివిజన్ కార్యదర్శి నర్సమ్మ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖర్‌రావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2014లో రూ.450 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.1050 పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. సా మాన్యుడు జీవించలేని విధంగా అన్ని నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. పెంచిన ధరలను కేంద్ర ప్రభుత్వ వెంటనే తగ్గించానికోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల ఇన్చార్జి కార్యదర్శి చింతల సత్తయ్య తదితరులు ఉన్నారు.
ప్రధానమంత్రి మోదీ హయాంలో దేశంలో కార్పొరేట్ పాలన నడుస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఖలేక్, సీపీఎం డివిజన్ కార్యదర్శి నాగరాజు ఆరోపించారు. శుక్రవారం నర్సాపూర్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డికి వామపక్ష పార్టీల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ పాలనలో ప్రధానంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగ డంతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. నిత్యావసర సరుకుల ధరలు అ దుపు చేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, 14 రకాల సరుకులు రేషన్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు బైల్పాటి గణేశ్, రాజాగౌడ్, బాలరాజు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరల ను అధికంగా పెంచి పేదప్రజలపై పెనుభారం మోపిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మద్ది లక్ష్మీనారాయణ పేర్కొన్నా రు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తోపాటు నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ ఆందో ళన చేపట్టారు. ఈ మేరకు చేగుంటలో తహసీల్దార్ లక్ష్మణ్‌బాబుకు సీపీఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కేంద్రప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. కార్పొరేట్ యాజమాన్యాల కు తొత్తులుగా మారి ప్రభుత్వ సంస్థలను విక్రయిస్తున్నదని ఆరోపించారు. సామాన్య ప్రజలు జీవించలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచిందని మండిపడ్డారు. పెంచిన పెట్రో ధరలతోపాటు నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గించాలని కోరారు. ధరలను తగ్గిచేవరకు సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరిచారు.