రామాయంపేట/ నిజాంపేట/ చేగుంట/ తూప్రాన్, అగస్టు 5 : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయజెండాను ఆవిష్కరించాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో అజాదీకా అమృత్ మహోత్సవ్‌పై ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్త యిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. నేటినుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, కౌన్సిలర్ల ప్రతి ఇంటికి జాతీయజెండాను అంద జేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ఉమాదేవి, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో 15 రోజులపాటు ప్రత్యే కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీపీ భిక్షపతి, ఎంపీడీవో ఉమాదేవి పేర్కొన్నారు. రామాయంపేట ఎంపీపీ కార్యాలయంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎంపీవో గిరిజారాణి, ఏపీవో శంకర్, కార్యదర్శులు నర్సాగౌడ్, శ్రీనివాస్, దేవేందర్, మహేందర్, మహేందర్‌రెడ్డి, శామల, పద్మ, కనకరాజు, సురేశ్ ఉన్నారు.
నిజాంపేట ఎంపీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 8 నుంచి 22 వరకు దేశభక్తి పెంపొందించేలా ప్రతి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ సిద్ధిరాములు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ్‌కుమార్, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంపీవో రాజేందర్, ఏపీవో శ్రీనివాస్, సర్పంచ్‌లు అమరసేనారెడ్డి, నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సురేశ్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.
చేగుంటలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీడీవో ఆనంద్మేరి, ఎంపీటీసీ హోలియనాయక్, సర్పంచ్‌లు కాశబోయిన భాస్కర్, వడ్డెపల్లి తిరుమల, సొసైటీ చైర్మన్ పరమేశ్ పాల్గొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రణాళికపై తూప్రాన్‌లో ఎంపీడీవో అరుంధతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమా వేశంలో ఎంపీవో రమేశ్, ఏపీవో సంతోశ్‌రెడ్డి పాల్గొన్నారు.