మెదక్ మున్సిపాలిటీ/ పెద్దశంకరంపేట/ రామాయంపేట/ వెల్దుర్తి/ శివ్వంపేట/ పాపన్నపేట/ చేగుంట, ఆగస్టు 5 : వరలక్ష్మీ వ్రతాలను జిల్లాలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీ. లక్ష్మీదేవిని పూజిస్తే అన్ని విధాలా శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక వ్రతాల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కొందరు ఇండ్ల లో వరలక్ష్మీ వ్రతాలను బంధుమిత్రుల మధ్య నిర్వహించారు. జిల్లా కేంద్రం మెదక్‌లోని ఆనాది హనుమాన్, కాళికదేవి, సరస్వతీ శిశుమందిర్, రేణుకాంబ ఆలయాల్లో సామూహిక వ్రతాలు నిర్వహించి, అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించి, మొ క్కులు తీర్చుకున్నారు. అష్టోత్తరాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆనాది హనుమాన్ ఆలయంలో వందలాది మంది మహిళలు వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొన్నారు. కొందరు మహిళలు తోటి మహిళలకు పసుపుబోట్టు ఇచ్చారు. పెద్దశంకరంపేటలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.
ప్రధానాచార్యులు వీరప్ప మాట్లాడుతూ మహిళలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తే కుటుంబాల్లో ఐష్టెశ్వర్యాలు కలుగుతాయన్నారు. రామాయంపేట మున్సిపాలిటీతోపాటు మండలంలోని శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయాలతోపాటు భక్తులు ఇండ్లలోనే వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. వెల్దుర్తి మండల వ్యాప్తంగా మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధ్దలతో వత్రాలు నిర్వహించారు.
ఆలయాల్లో భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అన్నదానం చేశారు. శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయశర్మ ఆధ్వర్యం లో స్వామివారికి విశేష పుప్పార్చన చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో శశిధర్, అర్చకులు పాల్గొన్నారు.