హుస్నాబాద్, ఆగస్టు 4 : తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ అన్నారు. గురువారం పట్టణంలోని స్వర్ణకారుల భవనంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు తల్లిపాలల్లో సమతూకంలో ఉంటాయన్నారు. బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనిత, సీడీపీవో జయ, కౌన్సిలర్లు సుప్రజ, హరీశ్, రమేశ్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
హుస్నాబాద్ రూరల్, ఆగస్టు 4 : తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని ఎంపీపీ మానస అన్నారు. మండలంలోని పోతారం(ఎస్) గ్రామంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ముర్రుపాలు శిశువులకు పట్టిస్తే ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయిలు, సీడీపీవో జయ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
నంగునూరు, ఆగస్టు 4 : తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యకరమని, దీంతో చిన్నారుల్లో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని జడ్పీటీసీ ఉమావెంకట్రెడ్డి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నంగునూరులో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మమతాజైపాల్రెడ్డి, ఎంపీటీసీ సునీతామహేందర్గౌడ్, తహసీల్దార్ భార్గవ్సాగర్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు లలితాశ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ పాల్గొన్నారు.
రాయపోల్, ఆగస్టు 4 : తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని సర్పంచ్ కొండారి సంధ్యారాణీగణేశ్ అన్నారు. మండంలోని రాంసాగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ శిశువు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. దీంతో భవిష్యత్లో పిల్లలకు వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని చెప్పారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజిరెడ్డి, ఏఎన్ఎం మంజుల, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మిరుదొడ్డి, ఆగస్టు 4 : మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు అంగన్వాడీ టీచర్లు సీమంతం చేసి పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం విజయ, ఆశ వర్కర్లు, గర్భిణులు పాల్గొన్నారు.
చేర్యాల, ఆగస్టు 4 : తల్లిపాలు అమృతంతో సమానమని సీడీపీవో శారద అన్నారు. మండలంలోని ముస్త్యాల రైతు వేదికలో చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చిన్నారులకు అన్నప్రసాన, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో శారద మాట్లాడుతూ తల్లిపాలు శిశువులకు ఎంతో శ్రేయస్కరమని, తప్పకుండా పిల్లలకు ముర్రుపాలు పట్టించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లారెడ్డి, ఎంపీటీసీ కమర్ సుల్తానా, హెచ్ఎం రాజమల్లయ్య, సూపర్వైజర్ పుష్పలత, పోషణ్ అభియాన్ టీం సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.