కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైంది. 2016లో కొత్త జిల్లాగా సిద్దిపేటను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొత్తగా డివిజన్ కేంద్రాలు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో పాలనా వికేంద్రీకరణ జరిగి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వేగంగా అమలై ఫలితాలు కనిపిస్తున్నాయి. గడపగడపకూ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి.
తండాలను సైతం ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా మార్చడంతో గిరిజనులకు అన్నివిధాలా మేలు జరుగుతున్నది. కొత్తగా కుకునూరుపల్లి, అక్బర్పేట-భూంపల్లి మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మొత్తం మండలాల సంఖ్య 26కు చేరనున్నది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
సిద్దిపేట, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్రంలో పాలన సంస్కరణలు అమలు చేయడంతో పరిపాలన ప్రజల ముంగిటకు చేరింది. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణను అగ్రగామి నిలిపారు. ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది.
పరిపాలన సౌలభ్యం కోసం 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా డివిజన్ కేంద్రాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవడంతో ప్రజలకు పాలనా మరింత దగ్గరైంది. దీంతో ప్రతి గడప గడపకూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అభివృద్ధి పలాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. గిరిజన తండాలను పంచాయతీలుగా చేసింది.
ప్రతి 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా చేయడంతో అభివృద్ధికి మారు పేరుగా మారాయి. గ్రామ పంచాయతీలను మరింతగా పటిష్ట పరిచేందుకు ప్రభు త్వం పక్కా విజన్‌తో ముందుకు వెళ్తూ అవసరమైన నిధులను విడుదల చేస్తు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది.
సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచే విధంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలు రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచాయి. అవే పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలో కొత్తగా మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో అభివృద్ధిలో ఆదర్శంగా నిలువనున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా 2016 అక్టోబర్ 11న ఆవిర్భవించింది. జిల్లా ఏర్పాటు సమయంలో 22 మండలాలు, 399 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా నుంచి హుస్నాబాద్ ప్రాంతం, వరంగల్ నుంచి చేర్యాల ప్రాంతం సిద్దిపేట జిల్లాలో విలీనమయ్యాయి. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ కేం ద్రాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వెళ్లాలంటే దూర భారం అధిక మయ్యేది. సిద్దిపేట నుంచి సుమారు 150 కి.మీటర్ల దూరంలో సంగారెడ్డి ఉండేది. దీంతో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు చాలా ఇబ్బందులు పడేవారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ 50 కి.మీటర్ల దూరం ఉండే విధంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు జిల్లా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దూర భారం తప్పింది. సమయం కూడా ఆదా అవుతున్నది. ఇదే క్రమంలో ప్రజల అభీష్టం మేరకు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. జిల్లాలో అక్కన్నపేట, హుస్నాబాద్, మద్దూరు మండలాల్లో గిరిజన తండాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక్కడ ప్రతి 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలు మార్చారు. అర్హత ఉన్న ప్రతి మధిర గ్రామాన్ని గ్రామ పం చాయతీలుగా మారడంతో గ్రామ అభివృద్ధిలో పంచాయతీలు పోటీ పడుతున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉన్నారు. ప్రస్తు తం జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. జిల్లా ఏర్పాటు సమయంలో 399 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. సీఎం కేసీఆర్ జిల్లాలో 100 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు సమయంలో 17 మండలాలు ఉన్నాయి.
ఆ సమయంలోనే కొత్తగా సిద్దిపేట అర్బన్, రాయపోల్, అక్కన్నపేట, కొమురవెల్లి, మర్కూక్ మండలాలుగా ఏర్పాటు చేస్తూ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా ఆవిర్భావ సమయంలో 22 మండలాలు ఉన్నాయి. తర్వాత ప్రజల అభీష్టం మేరకు సిద్దిపేట నియోజకవర్గంలో నారాయణరావుపేట మండలం ఏర్పటైంది. అనంతరం జనగామ నియోజకవర్గంలో ధూళిమిట్ట మండలం ఏర్పాటు చేశారు. దీంతో మండలాల సంఖ్య 24కు చేరింది.
తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో కుకునూరుపల్లి, దుబ్బాక నియోజకవర్గంలో అక్బర్పేట-భూంపల్లి (ఎక్స్‌రోడ్డు) మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన విష యం తెలిసిందే. దీంతో జిల్లాలో మొత్తం కొత్త వాటితో కలుపుకొని 26 మండలాలు. కొత్త మండలాలతో ప్రజలకు మరింతగా మెరుగైన పాలన అందనున్నది. ప్రజలకు దూర భారం కూడా తగ్గనున్నది. కొత్త మండలాల ఏర్పాటుతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అక్బర్పేట-భూంపల్లి మండలమనేది ఈ ప్రాంత ప్రజల 20 ఏండ్ల కల. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెరవేరింది. మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతోనే కొత్త మండలం సిద్ధించింది. ఇందుకు మండల ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. అక్బర్పేట-భూంపల్లి చౌరస్తా మండలంగా ఏర్పడనుండడంతో 10 గ్రామాల ప్రజలకు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభించనున్నది.
సిద్దిపేట-రామాయంపేట రోడ్డు మధ్యలో ఉన్న భూంపల్లి చౌరస్తా అభివృద్ధి చెందనున్నది. ఈ మండలంలో కూడవెల్లి, దుబ్బ రాజేశ్వరాలయాలు ఉండడంతో ఆధ్యాత్మికతకు నెలవుగా మారనుంది. సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంత ప్రజలంతా రుణపడి ఉంటారు. ఇం దుకు సహకరించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యావాదాలు.
కుకునూరుపల్లి మండల కేంద్రంగా ప్రజల సౌకర్యార్థం కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏండ్లుగా ఇక్కడి ప్రజలు కన్న కలలను ప్రభుత్వం నిజం చేసింది. ఇంతకాలం మండల కేంద్రంలోని కార్యాలయాలకు వెళ్లడానికి ప్రజల దూరభారాన్ని, ఎన్నో అవస్థలను అనుభవించారు. నూతన మండల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం తొలిగించింది. ప్రజల ఆకాంక్షను గౌరవించి కుకునూరుపల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– దేవీరవీందర్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్