మనోహరాబాద్/ పెద్దశంకరంపేట, జూలై 28 : ఆపత్కాలంలో నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ జడ్పీ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ… సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
నిరుపేదలకు సైతం మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానలను నిర్మించారని కొనియాడారు. వెంకటాయపల్లికి చెందిన తొంట సత్తమ్మకు రూ.22,500, కోనాయిపల్లికి చెందిన దుర్గం దీపికకు రూ. 14,500, దుర్గం కృష్ణాగౌడ్‌కు రూ. 22 వేలు, రామాయిపల్లికి చెందిన రితీశ్కు రూ. 27,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మన్నె నాగరాజు, హరీశ్, చంద్రంగౌడ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలంలోని టెంకటి గ్రామానికి చెందిన చుక్క మోహన్ కు రూ.31500 సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. కార్యక్రమంలో పీఎసీఎస్ వైస్‌చైర్‌పర్సన్ సువర్ణ, నాయకుడు కోనం అంజయ్య పాల్గొన్నారు.