కొల్చారం, జూలై 28 : మండలంలోని రంగంపేట గ్రామా న్ని కేంద్రంగా చేసుకొని మండలంగా ఏర్పాటు చేయాలంటూ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనబాట పట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో రంగంపేట మండలంగా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుతో మండలాన్ని కొల్చారం గ్రామానికి తరలించారు. అప్పటి నుంచే రంగంపేట మండలం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించడంతో రంగంపేట మండల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయ కులు ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
కాగా, గురువారం రంగంపేట గ్రామస్తులు, యువజన సంఘాలు, పరిసర గ్రామాల ప్రజలు ‘రంగంపేట మండల సాధన సమితి’గా మారి నిరవధిక దీక్ష చేపట్టారు. రంగంపేట సర్పంచ్ బండి సుజాతారమేశ్ నేతృత్వంలో పరిసర గ్రామాల సర్పంచ్‌లు ఎనగండ్లలో ఎంపీపీ మంజులా కాశీనాథ్‌ను కలిసి, మద్దతు కోరారు. ఏటిగడ్డమాందాపూర్ సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, కోనాపూర్ సర్పంచ్ రమేశ్, పైతర సర్పంచ్ సంతోష, తుక్కాపూర్ సర్పంచ్ మాధవీశ్రీశైలం, సంగాయిపేటలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, చిన్నాఘన్పూర్లో సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఏడుపాయల డైరెక్టర్ బాగారెడ్డి తోపాటు వివిధ సంఘాల నేతలు రంగంపేట మండల ఏర్పా టుకు మద్దతు తెలిపారు. రంగంపేటలో చేపట్టిన దీక్షలో ఎ మ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్ర ప్రభాకర్‌తోపాటు వివిధ పార్టీలతోపాటు యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట, జూలై 28 : జంబికుంట గ్రామాన్ని నిజాంపేటలో కాకుండా పెద్దశంకరంపేట మండలంలోనే కొనసాగించాలని గ్రామస్తులు తహసీల్దార్ చరణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నోఏండ్లుగా పెద్దశంకరంపేటలోనే కొనసాగుతున్నామని.. గ్రామాన్ని పాత మండలంలోనే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయమ్మ, నేతలు మా మిడి సాయిలు, రఘుపతిరెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు.