మెదక్, జూలై 28(నమస్తే తెలంగాణ) : మెతు కు సీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. రైల్వేలైన్ రాకపోకలు వచ్చే నెల 1న ప్రారంభం కానున్నది. ప్రత్యేక గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయి. గురువారం మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి మెదక్‌లోని రైల్వే స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతున్నదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 50కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు నిధుల కేటాయింపుతో పాటు, పనులు త్వరగా పూర్తయ్యేలా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారని పేర్కొన్నారు. గజ్వేల్‌కు రేక్ పాయింట్ ఏర్పాటు అనంతరం మెదక్‌లో ఏర్పాటుకు సెంట్రల్ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ అంగీకారం తెలిపిందన్నారు. ఆగస్టు 1న మెదక్ లో రేక్ పాయింట్ ప్రారంభిచడానికి మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.
గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయని, రేక్ పాయింట్ వల్ల సకాలంలో జిల్లాలోని రైతుల కు ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎఫ్‌సీఐకి పంపే బియ్యా న్ని రైల్వేమార్గం ద్వారా పంపవచ్చన్నారు. రేక్ పాయింట్ వల్ల పలువురికి ఉపా ధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు సమీయొద్దీన్, జయరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, ఉమర్ ఉన్నారు.