మెదక్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి హరితహారంపై జిల్లా అటవీ శాఖ, గ్రామాణాభివృద్ధి, ఆయా మండలాల ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలను నాటేందుకు ప్రణాళిక ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ఈ విషయంలో జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాని కంటే ఎక్కువగా మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షించాల్సిన బా ధ్యత ఉందన్నారు. దీనికి ఏఏ ప్రాం తాల్లో ఎలాంటి మొక్కలు అవసరమనేది ముందుగానే అటవీ శాఖ అధికారులకు తెలియజేస్తే వారు వాటిని సమకూర్చేందుకు వీలుంటుందన్నా రు.
జిల్లాలో హరితహారం కింద అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. జిల్లాలోని ఆయా శాఖ ల వారీగా మొక్కలను నాటడం, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా అప్పగించాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జరుగుతున్నదని కలెక్టర్ వివరించారు.
దీంతో పాటు ఇండ్ల వద్ద ఖాళీ ప్రదేశాలు, పాఠశాలలు, హాస్టళ్లు, వివి ధ శాఖల వద్ద ఎక్కడ ఖాళీగా ఉండకుండా పచ్చదనం ఫరిడవిల్లేలా మొక్కలు నాటాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశా రు. ఆయా మండలాల్లోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకుని త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేసే దిశ గా సాగాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్, జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, డీఆర్డీవో శ్రీనివాస్, ఆయా మండలాల ఎంపీడీవోలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.