దుబ్బాక, జూలై 24 : దుబ్బాక నియోజకవర్గంలో ఆదివారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు దుబ్బాకలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం దుబ్బాక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న కోట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి ఆయురారోగ్యాలతో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలని అమ్మవారికి ఎంపీ మొక్కులు చెల్లించుకున్నారు. దుబ్బాకలో బస్‌స్టాండ్, ప్రభు త్వ అతిథిగృహం నిర్మాణ పనులను ఎంపీ పర్యవేక్షించారు. అనంతరం దుబ్బాక పట్టణం, పోతారం గ్రామాల్లో నిర్వహించిన మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ నూరేండ్లు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
మంత్రి కేటీఆర్‌తోనే రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులతోపాటు ఐటీశాఖ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయన్నారు. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీగా తెలంగాణను ముందంజలో నిలిపిన ఘనత మంత్రి కేటీఆర్‌దేనన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితారెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు యాదగిరి, దేవుని లలిత, స్వామి, శ్రీనివాస్, బంగారయ్య, బాలకృష్ణ, రేకులకుం ట మల్లికార్జున దేవాలయ చైర్మన్ రొట్టే రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, నాయకులు బాలకిషన్‌గౌడ్, ఎల్లారెడ్డి, భూంరెడ్డి, రామస్వామిగౌడ్, మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, లచ్చయ్య, రాజిరెడ్డి, కిషన్‌రెడ్డి, బండి రాజు, ఎండీ ఖలీల్, భూపాల్ పాల్గొన్నారు.
దుబ్బాక ప్రెస్‌క్లబ్, డబుల్ బెడ్రూం ఇండ్ల
దుబ్బాకలో ప్రెస్క్లబ్తోపాటు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీకి ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ప్రెస్‌క్లబ్‌కు స్థల సేకరణ, వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక జర్నలిస్టుల కృషి వెలకట్టలేనిదన్నారు.
దశాబ్దాలుగా జర్నలిస్టు వృత్తిలో ఉం టూ ప్రజాఉద్యమాలతో పాటు తెలంగాణ సాధన కోసం తమవంతుగా చేసిన కృషి మరిచిపోలేనిదన్నారు. దుబ్బాక ప్రెస్క్లబ్తోపాటు, వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్ల స్థలాలు మం జూరు చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు ఇండు శివకుమార్, వెంకట్‌గౌడ్, లింగం, బాలరాజు, రాజమల్లు, లక్ష్మారెడ్డి, శంకర్, కల్యాణ్, వెంకటేశ్, సమీర్, చిన్ని కృష్ణగౌడ్ పాల్గొన్నారు.