హుస్నాబాద్, జూలై 24 : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన వేడుకలు హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించా రు. క్యాంపు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిరాడంబరుడు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేటీఆర్ ఆయురారోగ్యాలతో నూరేండ్లు జీవించాల ని భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్యా మంగ, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, మార్కెట్ చైర్మన్ అశోక్‌బాబు, కౌన్సిలర్లు నళినీదేవి, సుప్రజానవీన్, రమారవీందర్, రాజు, బొజ్జ హరీశ్, గోవిందు రవి, కల్పన, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, నాయకులు తిరుపతిరెడ్డి, గోపాల్‌రెడ్డి, సాయన్న, సాంబరాజు, డాక్టర్ రవి, కొండల్‌రెడ్డి, పరశు రాం, శంకర్‌రెడ్డి, పుష్ప, స్వరూప, అయూబ్, రమేశ్, శోభారాణి, మధుకర్, రమేశ్ నాయక్, ఇంతియాజ్, వికాస్, చిరంజీవి, హుస్నాబాద్, అక్కన్నపేట మం డలాల సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నా యకులు పాల్గొన్నారు.