గజ్వేల్ రూరల్/మద్దూరు/అక్కన్నపేట/హుస్నాబాద్ రూరల్/చేర్యాల/ కోహెడ/దౌల్తాబాద్/జగదేవ్‌పూర్, జూలై 24 : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. గజ్వేల్‌లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ మల్లేశం, వైస్ చైర్మన్ జకియొద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు పాల్గొన్నారు.
మరోవైపు మద్దూరులో ఉమ్మడి మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అక్కన్నపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాంబరాజు ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం అందజేశారు. హుస్నాబాద్ రూరల్ మండలంలోని వంగరామయ్యపల్లి, జిల్లెలగడ్డ గ్రామాల్లో ఎంపీపీ మానస మొక్కలు నాటారు. కొమురవెల్లి మండల వ్యాప్తంగా ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భిక్షపతి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు మొక్కలు నాటారు.
మండలంలోని లెనిన్‌నగర్‌లో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మశ్చేందర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేర్యాలలో ఇటీవల వర్షాలకుఇండ్లు కూలిన బాధితులకు మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపారాణి, రాష్ట్ర నాయకుడు బాల్‌నర్సయ్య బియ్యం అందజేశారు. అనంతరం డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కోహెడ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, జడ్పీటీసీ నాగరాజుశ్యామల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ మొక్కలు నాటారు.
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు టీఆర్ఎస్ నాయకులు నోట్ బుక్స్ అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కళాశాలలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ మొక్కలు నాటారు. అనంతరం తెలంగాణ భవన్లో రక్తదానం శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.
జగదేవ్‌పూర్‌లో మాజీ సర్పంచ్ జ్యోతీమహేందర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.