రామాయంపేట/ రామాయంపేట రూరల్, జూలై 24: ప్రపంచంలోని పెద్ద ఐటీ పరిశ్రమలను తెలంగాణలో నెలకొల్పేందుకు కృషి చేస్తున్న తెలంగాణ జాతిరత్నం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేటకు విచ్చేసిన ఆయన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దామరచెర్వు గ్రామంలో కేక్ కట్‌చేసి మొక్క నాటారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రుల మొప్పు పొందుతున్న డైనమిక్ లీడర్ మంత్రి కేటీఆర్ అని అన్నారు. అన్ని రాష్ర్టాలు కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉందంటే అది కేవలం సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చలవేనన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సీఎం కేసీఆర్ ప్రాముఖ్యత కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంజ విజయ్‌కుమార్, నాయకుడు పుట్టి అక్షయ్‌కుమార్, మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సరాఫ్ పాండురంగాచారి, ఈవో మోహన్‌రెడ్డి, శ్యాంరాజు, యాదగిరి, సత్యం, రామాయంపేట జడ్పీటీసీ సంధ్య, దామరచెరువు, చల్మెడ, రజాక్‌పల్లి సర్పంచ్‌లు పడాల శివకుమార్‌రావు, నర్సింహరెడ్డి, నారాగౌడ్, ఎంపీటీసీలు పాకాల శ్రీలత, రాజిరెడ్డి, పాకాల చంద్ర శేఖర్‌రావు, సురేశ్‌నాయక్, రవితేజ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.