రామచంద్రాపురం, జూలై 23: తెల్లాపూర్ నుంచి నల్లగండ్లకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం వర్షాల కారణంగా గుంతలుగా మారింది. బో న్సాయి అపార్ట్మెంట్ సమీపంలో పైపులైన్ కోసం తవ్వకాలు జరుపుతుండటంతో వర్షాల కు ఆ గుంతల్లోకి నీరు చేరింది. శనివారం ఓ బాలుడు తల్లితో కలిసి ఆ రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో బాలుడు గుంతలో పడిపోయాడు.
అటు వైపుగా కారు లో వెళ్తున్న మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, కౌన్సిలర్ లచ్చిరాంనాయక్ గుంతలో పడిపోయిన బాలుడిని గమనించారు. వెంటనే కారుని నిలిపి గుంతలోకి దిగి బాలుడిని రక్షించే ప్ర యత్నంలో తాను గుంతలో మునిగిపోతుండగా కౌన్సిలర్ లచ్చిరాం ఆ ఇద్దరిని బయటకు లాగాడు. ఆ బాలుడిని తన తల్లికి అప్పగించారు. స్థానికులు మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, కౌన్సిలర్ లచ్చిరాం చేసిన సాహాసానికి అభినందనలు తెలిపారు.