కోహీర్, జూలై23: మండలంలోని దిగ్వాల్ జీఎంఆర్ కళాశాలలో శనివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. బీఈడీ, డీఈడీ కళాశాలకు చెందిన ఛాత్రోపాధ్యాయులు బోనాలను ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి భక్తిభ్రద్ధలతో సమర్పించారు. దేవాతామూర్తుల వేషధారణలో విద్యార్థులు పలువురిని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గోడ్కె ప్రకాశ్‌కుమార్, సంతోశ్జోషి, సుధాకర్, సంపత్ పాల్గొన్నారు.
సంగారెడ్డి అర్బన్, జూలై 23: సంగారెడ్డి పట్టణ శివారులోని వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారు శనివారం శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశా రు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పాండయ్య, ప్రధాన కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షుడు రాధాకిషన్, విద్యాసాగర్, కృష్ణమూర్తి, ప్రకాశ్, తేజావతి, ఉమారాణి, నాగలక్ష్మి, హరీశ్, ప్రసన్న పాల్గొన్నారు.
జిన్నారం, జూలై 23 : ఊట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం నిర్వహించే బోనాల పండుగకు చిట్కుల్ సర్పంచ్ నీలం మధును కాలనీవాసులు శనివారం సాయం కోరారు. స్పందించిన ఆయన ఎన్ఎంఎం యువసేన సభ్యుల ద్వారా కాలనీ వాసులకు రూ. 30వేలు నగదును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌కి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ మహేశ్, సత్యనారాయణ, సాయి, శ్రీనివాస్, అర్జున్, వెంకటేశ్, భిక్షపతి, ఎల్లయ్య పాల్గొన్నారు.