రామాయంపేట/చేగుంట, జూలై 23: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్లోని మనోహరాబాద్ మండలం రామాయిపల్లి వద్ద జాతీయ రహదారి 44లో ఉన్న అండర్పాస్ బ్రిడ్జిలో నీళ్లు చేరాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నాలుగు గంటల పాటు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. వాహనాలను జీడిపల్లి మీదుగా తూప్రాన్ వెళ్లేందుకు దారి మళ్లించారు. నార్సింగి మండలం వల్లభాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిపోవడంతో అటవీశాఖలోని రహదారిపైకి వరద చేరింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.