చేగుంట, జూలై23: చేగుంట, నార్సింగి మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముగ్గురు మృతి చెందారు. చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ గణేశ్ మినరల్స్‌లో బీహార్‌కు చెందిన రన్బెన్ యాదవ్(50), వికారి యాదవ్(45), మరో ఇద్దరు కూలీలు పనిచేస్తున్నారు. కంపెనీలోని రేకుల షెడ్డులో ఉంటూ కూలీ చేసుకుంటూ జీవిస్తున్నారు.
శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రేకుల షెడ్డు మట్టి గోడ కూలి ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. అదే గది లో ఉంటున్న దినేశ్దాస్, గౌతం యాదవులకు తీవ్ర గాయాలయ్యాయి. చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడిన ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన తోకల సాయిలు (18) బయట దేశం వెళ్లేందుకు హైదరాబాద్‌లో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్తున్నాడు. వర్షం నీరు రోడ్డుపై నిల్వ ఉండడంతో అతడు వెళ్తున్న ద్విచక్రవాహనం డివైడర్‌కు ఢీకొని తీవ్రగాయాలయ్యాయి. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దవాఖానకు తరలిస్తుండగా, సాయి లు మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి ఎస్సై నర్సింహులు తెలిపారు.