చిలిపిచెడ్/ నిజాంపేట, జూలై 23 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మికి రూ.56వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైనది. ఈ మేరకు శనివారం హైదరా బాద్‌లో స్థానిక సర్పంచ్ గోపాల్‌రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు ఆపద సమయాల్లో దవా ఖాన ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్లో ఆర్థికసాయం చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో శ్రీపాద ట్రస్టు చైర్మన్ పైడి శ్రీధర్‌గుప్తా, స్థానిక నాయకుడు మైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని నిజాంపేట మండలం బచ్చురాజ్‌పల్లి గ్రామ సర్పంచ్ నర్సవ్వ అన్నారు. గ్రామానికి చెందిన ప్రభుదాసు దవాఖానలో చికిత్స పొందుతు న్నాడు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో ప్రభుదాసుకు రూ. లక్ష ఎల్వోసీ మంజూరైనది. బాధిత కుటుంబానికి ఉపసర్పంచ్ మల్లేశంతో కలిసి సర్పంచ్ నర్సవ్వ అందజేశారు.