పాపన్నపేట, జూలై 3: ఆషాఢ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారిని పుష్పాంబరీ రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఆలయ ఈవో సారశ్రీనివాస్, పాలకమండలి స భ్యులు, ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.
భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు, స మర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానికంగా ఎలాంటి సం ఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై విజయ్‌కుమార్ సిబ్బందితో కలిసి బందోబస్తు చర్యలు చేపట్టారు. వేద పండితులు శంకరశర్మ, పార్థివశర్మ, రాముశర్మ, రాజశేఖర్‌శర్మ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదివారం సాయంత్రం ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారిని సంగారెడ్డి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి పి.రాజు, నర్సాపూర్ జూనియర్ జడ్జి అనిత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వారికి ఆలయ ఈవో, చైర్మన్ శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.