ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం కేసీఆర్ మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో బీటీ రోడ్ల రెన్యువల్‌కు ఏకంగా రూ.401 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు.
ఆదివారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులు, ఇంజినీర్లతో హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.321 కోట్లు, పంచాయతీరాజ్ ఎంఆర్ఆర్ ద్వారా రూ.80 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
ఈ నిధులతో ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీరాజ్ పరిధిలోని 13 నియోజకవర్గాల్లో 454 పనులకు శ్రీకారం చుట్టి, 1494 కి.మీ మేర రోడ్ల పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు మనందరం రుణపడి ఉండాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ నిధులతో ప్రజాప్రతినిధులు నాణ్యతగా పనులు చేయించి ప్రజల మెప్పు పొందాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట, జూలై 03 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ్దతో ఉన్నారని, ఈ క్రమంలోనే మూడు జిల్లాల్లో బీటీ రోడ్ల రెన్యువల్‌కు రూ.401 కోట్లు మంజూరు చేసినట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులు, ఇంజినీర్లతో హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
రోడ్ల పునరుద్ధ్దరణ పనులు, కొనసాగుతున్న పనులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, మనఊరు-మనబడి, హెల్త్ సబ్ సెంటర్లు, ఉపాధి హామీ, గ్రామీణ సడక్ యోజన తదితర అభివృద్ధి పనుల పురోగతిపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలెప్మెంట్ ఫండ్ ద్వారా రూ.321 కోట్లు ఇవ్వగా, పంచాయతీరాజ్ ఎంఆర్ఆర్ ద్వారా రూ.80 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీరాజ్ పరిధిలోని 13 నియోజకవర్గాల్లో 454 పనులకు శ్రీకారం చుట్టి, 1494 కి.మీ మేర రోడ్ల పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు మనందరం రుణపడి ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ్ద చూపడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఎస్డీఎఫ్ రోడ్ల మరమ్మతు పనులు నియోజవర్గాల వారీగా, ప్యాకేజీ వారీగా పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, వర్షాలు తగ్గగానే మరమ్మతుల పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకొని రోడ్ల పునరుద్ధ్దరణ పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని, ప్రజాప్రతినిధులు కష్టపడి పనిచేసి ప్రజల మనసు గెలవాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. పూర్తయిన వాటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బీటీ రెన్యువల్ సమయంలో అవసరమున్న చోట సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ‘మనఊరు-మనబడి’ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాకలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు కేటాయించినందుకు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఏఎంసీ చైర్మన్ శివకుమార్, దేవేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ జోగారెడ్డి, ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల వైద్యారోగ్య శాఖ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులపై టీఎస్ఎంఎస్ఐడీసీ, ఇతర అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. పలు దవాఖానల మరమ్మతుల పనులు వేగవంతం చేయడంతో పాటు సబ్ సెంటర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.