మెదక్ మున్సిపాలిటీ, జూలై 3 : ఇటీవల చేపట్టిన పట్టణ ప్రగతి 4వ విడుత కార్యక్రమం మెదక్ మున్సిపాలిటీలో విజయవంతమైంది. ఈ నెల 3 నుంచి 17వ తేదీ వరకు 15 రో జుల పాటు పట్టణ ప్రగతి చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వారుల్లో పర్యటించి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయి లో తెలుసుకోని అక్కడికక్కడే పరిష్కరిస్తూ మౌలిక వసతులు సమకూర్చారు. డ్రైనేజీలను శుభ్రం చేయిస్తూ.. ఖాళీ స్థలాల్లో కలుపు మొక్కలను, పొదలను తొలిగించి శుభ్రం చేశారు. పట్ట ణ ప్రగతి పనులు మెదక్ మున్సిపల్లో కొనసాగుతున్నాయి.
గతంలో స్థానికంగా వేధిస్తున్న సమస్యలు ఎవరికి చెబితే పరిష్కారమవుతాయో? సంబంధిత అధికారులు ఎక్కడ ఉం టాడో తెలియని పరిస్థితి పట్టణ ప్రజలకు ఉండేది. ఈ క్రమం లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రజలకు వరమైంది. ఎన్నడూ కనిపించని ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ప్రాంతానికి వచ్చి సమస్యలు ఉన్నాయా? అని అడగడం, చిన్నచిన్న సమస్యలైతే వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడం పట్టణ ప్రగతి పుణ్యమేనని పట్టణ ప్రజ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ మున్సిపాలిటీల్లో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. జూలై 3 నుంచి 15వ తేదీ వరకు పదిహేను రోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారు లు సుడిగాలి పర్యటనలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా ప్రత్యేకాధికారి త్రిల్లేశ్వర్రావుతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొని విజయవంతం చేశారు.
మెదక్ బల్దీయాను పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు పట్టణ ప్రగతిలో భాగం వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పట్టణంలో పదిహేను రోజుల్లో 267.84 టన్నుల చెత్త, 60.53 టన్నుల శిథి ల వ్యర్థాలను తొలిగించారు. 133.55 కి.మీ మేర రోడ్డు పక్క న, ఆయా వార్డుల్లో పొదలను తొలిగించి, శుభ్రం చేశారు. 108.41 కి.మీ మేరక మురుగు కాలువల్లో పూడిక తీశారు. శిథిలావస్థలో ఉన్న 18 ఇండ్లను కూల్చి శిథిలాలను తొలిగించారు. 22 లోతట్టు ప్రాంతాలను పూడ్చివేశారు. 120 ప్రాం తాల్లో స్ప్రే పిచికారీ, ఫాగింగ్ చేశారు. పట్టణంలోని 17 ఓహెచ్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్, ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్లతో పాటు పార్కులను శుభ్రం చేశారు. ఎండిపోయి పని చేయని 13 బోర్లను మూసివేశారు. 7 బోరు మోటర్లకు కొత్త కేపాసీటర్ల అమర్చారు. 60 విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల ను శుభ్రం చేశారు. 63 మతపరమైన ప్రదేశాలు, పార్కులను శుభ్రం చేశారు. 13 వైకుంఠధామాలను శుభ్రం చేశారు. పట్టణంలో రెండు క్రీడా ప్రాంగణాలను గుర్తించి ప్రారంభించారు. దళిత వాడలను సందర్శించి, సమస్యలు పరిష్కరించారు.
పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో కరెంట్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారు. 37 వంగిన స్తంభాలను సరిచేశారు. 55 తుప్పుపట్టిన స్తంభాలను తొలిగించి కొత్తవి వేశా రు. 2,023 మీటర్ల మేర వేలాడుతున్న తీగలను సరిచేశారు. అవసరమైన చోట నూతన తీగలను ఏర్పాటు చేశారు. పట్టణలో రోడ్ల పక్కన 285 మొక్కలు నాటారు. 400 మొక్కల ను ఇంటింటికీ పంపిణీజేశారు. 843 మొక్కల చుట్టూ కలుపు తీశారు. ట్రీ పార్కుల కోసం 7 స్థలాలను గుర్తించారు.
మెదక్ మున్సిపాలిటీలో చేప ట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అ ధికారులు వార్డుల్లో పర్యటించి, సమస్యలను గుర్తించాం. కొన్ని సమస్యలను అధికారుల సహకా రంతో అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సమస్య లు పరిష్కారం అయ్యేలా పట్టణ ప్రగతి కార్యక్రమా లు దోహదపడ్డాయి. పారిశుధ్య, స్వచ్ఛత, హరిత హా రం పనులను పరిశీలించాం. మున్సిపల్ సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాం. వార్డు ల్లో పలు అభివృద్ధి పనులను సైతం ప్రారంభించారు.
– సాధిక్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు
మున్సిపాలిటీలోని ప్రతి వా ర్డుల్లో పర్యటించి, ప్రజలకు స్వ చ్ఛతపై అవగాహన కల్పించాం. పట్టణ ప్రగతిలో భాగంగా ము న్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి ప్రజలతో నేరుగా మాట్లాడి చెత్త సేకరణ వివరించాం. మొత్తం 32 వార్డుల్లో పర్యటిం చి, సమస్యలు గుర్తించాం. కరెంట్, తాగునీరు ఇతర సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాం. క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, ప్రకృతి వనాల ఏర్పాటుపై ప్ర త్యేక దృష్టి పెట్టాం. వార్డుల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం.
-శ్రీహరి, మున్సిపల్ కమిషనర్
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణ ప్రగతిలో తామంతా భాగస్వాములమై అన్ని వార్డుల్లో పర్యటించాం. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వారివద్దకే నేరుగా వెళ్లి అడిగి తెలుకుని, పరిశీలించాం. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాం. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కాలనీల వాసులు చేసి విజ్ఞప్తులు పరిశీలిస్తున్నాం. పనులు చేపట్టేందుకు అయ్యే అంచనా వ్యయాన్ని ఇంజినీరింగ్ అధికారులు తయారు చేస్తున్నారు.
– తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్