గజ్వేల్, జూన్ 22 : పట్టణంలో ఒలింపిక్ రన్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. బుధవారం ఎఫ్డీసీ చైర్మన్, ఒలింపిక్ రన్ 2022 నియోజకవర్గ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజ్ఞా గార్డెన్ నుంచి మహతి ఆడిటోరియం వరకు నిర్వహించారు. రన్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36వ ఒలింపిక్ డే రన్ గజ్వేల్‌లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమంతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా అన్ని విధాలు ముందుస్థానంలో నిలువాలని మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారన్నారు. గజ్వేల్ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్‌లు, గురుకుల పాఠశాలలు, మైనార్టీ పాఠశాలలు, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. ఎక్కడా లేని విధంగా 28 ఎకరాల్లో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.
ఒలింపిక్ డే రన్ ముఖ్య ఉద్దేశం ‘పంపించు లేదా తరలించు, అన్వేషించు లేదా కనుగొను, తెలుసుకో లేదా తెలుపు అన్నట్లు’ క్రీడాకారులంతా ఇతర యువతలో క్రీడల వైపు ఆసక్తిని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ ప్రాంత క్రీడాకారులు రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, బొగ్గుల చందు, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ ఆర్కే శ్రీనివాస్, నాయకులు కూరాకుల సాయి, నవాజ్‌మీరా, సుభాశ్ చంద్రబోస్, అహ్మద్, శ్రీనివాస్, స్వామిచారి, నర్సింలు, పీఈటీలు ఇలియాస్రావు, రాజిరెడ్డి, విజయరేఖ, నగేశ్, గణేశ్, శివ, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.