న్యాల్కల్, జూన్ 16 : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆంగ్ల మాద్యమంలో బోధన కొనసాగతుండటంతో చాలా మంది తల్లి దండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లంలో బోధన చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను అందజేస్తున్నారు. మండలంలోని 45 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత, 8జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక కస్తుర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, ఒక ఎస్సీ గురుకుల బాలుర పాఠశాలలు ఉన్నాయి.
ఇందులో మండలంలోని న్యాల్కల్, మిర్జాపూర్(బి), మెటల్‌కుంట, మామిడ్గిలో మాడల్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆంగ్లంలో విద్యార్థులకు బోధిస్తుండగా, హద్నూర్, మామిడ్గి, మిర్జాపూర్ (ఎన్), మల్గి, డప్పూర్, రాంతీర్థం, టేకూర్, మెటల్‌కుంట తదితర పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్లంలోనే బోధిస్తున్నారు. మండలంలోని ఆయా పాఠశాలలో 2019-20 సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 5258 మం ది విద్యార్థులు చదువుకున్నారు.
2020-21విద్యా సంవత్సరంలో 5405మంది విద్యార్థులు, 2021 -22 విద్యా సంవత్సరంలో 5,817మంది విద్యార్థులు ఆయా పాఠశాలల్లో చదువుకుంటున్నా రు. మనఊరు -మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంపై వాటిపైనే మక్కువ చూపుతున్నారు. జయశంకర్‌సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదవించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి 389మందిని అడ్మిషన్ చేయించారని మండల విద్యాధి కారి, ఆయా ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో తెలుగు, ఆంగ్లంలో నాణ్యమైన విద్యను బోధిస్తుండటంతో ప్రజలు తమ పిల్లలను సర్కారు పాఠశాలలో చేర్పిస్తున్నా రు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని మిర్జాపూర్(బి), మెటల్‌కుంట, హద్నూర్, మల్గి గ్రామాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాం. పాఠశాలల మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, అదనపు గదు లు, వంట గదులు, టాయిలెట్లను శానిటైజేషన్ చేయించాం. ప్రైవే టు పాఠశాలలో సౌకర్యాలు తక్కువ ఉండటంతో ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవే టు పాఠశాలల నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు.
– మారుతీరాథోడ్, ఎంఈవో, న్యాల్కల్