నిజాంపేట/ మనోహరాబాద్/ రామాయంపేట/ మెదక్ రూరల్/ చేగుంట, జూన్ 16 : జిల్లావ్యాప్తంగా పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. గురువారం గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామస్తులతో కలిసి పనులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పరిసరాల స్వచ్ఛత పనులు, పారిశుధ్య పనులు చేపడుతున్నారు. రోడ్లను శుభ్రపర్చడం, మురుగునీటి కాల్వలను శుభ్రం చేయించడం, ఇండ్లలోని వచ్చే చెత్తను తడి, పొడిగా సేకరించడం, డంపింగ్ యార్డుల్లో చెత్త ను వేరు చేయడం, కంపోస్టు ఎరువు తయారీ చేస్తున్నారు.
జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి, పల్లె ప్రగతి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. పల్లెప్రగతి పనుల్లో ప్రజలు పాల్గొని గ్రామాభివృద్ధికి పాటు పడాలని డీపీవో తరుణ్‌కుమార్ అన్నారు. నిజాంపేట మండ లంలోని చల్మెడ, నస్కల్ గ్రామాల్లో పర్యటించి పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు, నర్సరీలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ సిద్ధిరాములు, ఎంపీడీవో వెంకటలక్ష్మి, సర్పంచ్‌లు కవిత, నర్సింహారెడ్డి, ఎంపీటీసీ బాల్‌రెడ్డి, ఎంపీవో రాజేందర్, కార్యదర్శిలు నర్సింహారెడ్డి, ప్రేమలత ఉన్నారు.
పల్లె ప్రగతితోనే గ్రామాభివృద్ధి సాధ్యమని డీఎల్పీవో శ్రీనివాస్ అన్నారు. మనోహరాబాద్ మండలంలో గౌతోజిగూడెం గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. హరితహారం మొక్కల నిర్వహణ, పరిశుభ్రత ప నులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ రేణుకుమార్, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, కార్యదర్శి రమాదేవి, గ్రామస్తులు పాల్గొన్నారు.
మనోహరాబాద్ మండలంలోని కూచారం, కాళ్లకల్‌లో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎంపీడీవో కృష్ణమూర్తి పరిశీలించారు. కాళ్లకల్‌లో క్రీడా ప్రాంగణంలో పిల్లల ఆట వ స్తువులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజుయాదవ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పల్లెలు వనాలుగా మారాలని ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. రామాయంపేట మండలంలో డి.ధర్మారం, శివ్వాయపల్లి, సుతారిపల్లి, రాయిలాపూర్ గ్రామాల్లో పర్యటించి, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్‌లు నర్సాగౌడ్, శంకర్, మల్లేశం, సంధ్య, కార్య దర్శులు మహేందర్‌రెడ్డి, పద్మ, జ్యోత్స్న, మహేందర్ ఉన్నారు.
పల్లెప్రగతి పనుల్లో గ్రామస్తులంతా భాగస్వాములు కావాలని ఎంపీడీవో శ్రీరాములు అన్నారు. మెదక్ మండలంలోని వెంకటాపూర్, బాలానగర్‌లో పల్లెప్రగతి పనులను పరిశీలిం చారు. ఆయన వెంట సర్పంచ్‌లు రాజ్యలక్ష్మీరవీందర్, వికాస్ కుమార్, పంచాయతీ కార్యదర్శి నర్సింహులు ఉన్నారు. నార్సింగి మండలం నర్సంపల్లిలో ఎంపీపీ సబిత, ఎంపీడీవో ఆనంద్మేరి, సర్పంచ్ భారతి, మాజీ ఎంపీటీసీ సత్యం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. జెప్తిశివునూర్లో సర్పంచ్ షేక్ షరీఫ్ ఆధ్వర్యంలో రోడ్లను శుభ్రం చేశారు.