మెదక్ అర్బన్, జూన్ 16 : చిన్న నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీస్తుందని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వేగంగా గమ్యస్థానాలకు చేర్చే వాహనాలు ప్రాణాలను సైతం గాల్లో దీపాల్లా మార్చేస్తున్నాయన్నారు. ప్రమాదాల నుంచి ప్రాణాలతో బ యటపడేందుకు వాహనాల్లో ఏర్పాటు చేసిన సాంకేతిక, రక్షణ వ్యవస్థలను వాహన చోదకులు తెలిగ్గా తీసుకోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నార న్నారు. వాహనదారులు నిర్ణీత వేగం కంటే ఐదు శాతం తగ్గించి నడపడం వల్ల 30శాతం ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
వాహనాలు నడిపేటప్పుడు అలసటగా ఉన్నా లేక నిద్ర వచ్చినా అలాంటి సమయంలో విశ్రాంతి తీసుకోవాలన్నారు. దీంతో కొంత వరకు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొ న్నారు. చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి సీటు బెల్టు పెట్టుకోకపోవడం కారణమని తెలుస్తోందన్నా రు. ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్టు పెట్టుకుం టే ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు.
ప్రమాదాల సమయంలో కారులో నుంచి రోడ్డు మీదకు రాకుం డా సీటు బెల్టు ఉపయోగపడుతుందని, ఎయిర్ బ్యా గ్స్ ఒపెన్ అయి గాయాల తీవ్రతను తగ్గిస్తాయన్నారు. వాహనాల్లో వినియోగించే ప్రధాన రక్షణ వ్యవస్థలో సీటు బెల్టు అత్యంత ప్రధానమైనదని పేర్కొన్నారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాలకు లోనైతే సీటు బెల్టు ధరించి ఉన్న వారిలో ప్రాణాపాయాన్ని 75శాతం నుంచి 80శాతం వరకు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. కారు లో ప్రయాణిస్తున్నపుడు ఏ సీట్లో కూర్చున్న సీటు బెల్ట్ ధరించడం మర్చిపోవద్దని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణాలు చేయలన్నారు.