గజ్వేల్ రూరల్, జూన్16 : ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యే క చొరవతో ఎరువుల రాకపోకల నిర్వహణ కోసం గజ్వేల్, మెదక్‌లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు గురువారం రైల్వే అధికారులు మం త్రికి సమాచారం అందించారు. కాగా, వ్యవసాయదారులు, స్థానిక ప్రజల సమక్షంలో రేక్ పాయింట్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేయాలని గజ్వేల్, మెదక్ అధికారులను మంత్రి ఆదేశించారు. రైల్వే కొత్త రేక్ పాయింట్ రాకతో ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా వ్యా పారులు, రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నది. గజ్వేల్ నుంచి దేశంలోనే ఏ ప్రాంతానికైనా సరుకు రవాణా సులభతరం కానున్నది.
డబ్బుతోపాటు సమయం ఆదా, తక్కువ ఖర్చుతో తమ ప్రాంత వ్యవసాయ, ఇతర ఉత్పత్తులను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏర్పటైన కొత్తపల్లి-మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లను ఎఫ్‌సీఐ గోదాంలతో అనుసంధానించే అంశంపై మంత్రి ప్రత్యేక విజన్‌తో గజ్వేల్ ‘గడా’ కార్యాలయంతో జిల్లా అధికారులు, రైల్వే అధికారులతో జరిపిన సమీక్షతో పనులు శరవేగంగా ముందుకు సాగాయి.
కొత్త రైల్వే లైన్లతో ఎఫ్‌సీఐ గోదాంలకు అనుసంధానంపై జరిగిన సమీక్షతో గూడ్స్ రైల్వే సర్వీస్ ద్వారా ఎఫ్‌సీఐ గోదాంలకు బియ్యం పంపిణీ చేసుకునే వెసులుబాటు, ఎరువుల పంపిణీ చేసుకునే అవకా శం ఉంటుంది. గజ్వేల్‌లోని గోదాంలకు అనుసంధానం చేస్తే మరింతగా ప్రయోజనం చేకూరనున్నది. మంత్రి సూచనలను పరిగణలోకి తీసుకున్న ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్, అధికారుల బృందం సానుకూలంగా స్పందించి నిర్ణ యం తీసుకుంది. గజ్వేల్, మెదక్‌కు ఎరువుల రవాణా చేయాలని మార్క్‌ఫెడ్ అధికార బృందం కూడా సమావేశంలో నిర్ణయించి ఆమోదం తెలిపింది.