నారాయణఖేడ్, మే 26: టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు సముచిత గౌరవం కల్పించడంతో పాటు తండాలను అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండలం మాద్వార్ తండాలో భవానీమాత, సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. తండాలను పం చాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులే ప్రతినిధులుగా కొనసాగే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారన్నారు.
రూ.35 కోట్ల నిధులతో నియోజకవర్గంలోని 80 శాతం తండాలకు బీటీ రోడ్డు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే, మిగతా తండాలకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గిరిజనులు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలనే ఉద్దేశంతో నాల్గు ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆధ్యాత్మికంగా గిరిజనులు ఎంతో చైతన్యం సాధించారని, ప్రతి తండాలో భవానీమాత, సంత్‌సేవాలాల్ మహరాజ్‌ల ఆలయాలను నిర్మించడమే కాకుం డా నిత్యం భక్తి మార్గాన్ని అనుసరించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహరాజ్ ,జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్‌నాయక్, బంజారా సేవాలాల్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షడు రమేశ్చౌహాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, నాయకుడు రాజునాయక్ పాల్గొన్నారు.