మనోహరాబాద్/ హవేళీఘనపూర్/ మెదక్‌రూరల్/ రామాయంపేట/ శివ్వంపేట, జూన్ 15 : జిల్లావ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామస్తులతో కలిసి పల్లె ప్రగతి పనులను నిర్వహిస్తున్నారు. బుధవారం ముఖ్యంగా పరిసరాల స్వచ్ఛత పనులు, పారిశుధ్య పనులు చేపట్టారు. రోడ్లను శుభ్రపర్చడం, చెత్తాచెదారాన్ని తొలిగించడం, మురుగునీటి కాల్వలను శుభ్రం చేయించడం, ఇండ్లలోని వచ్చే చెత్తను తడి, పొడి గా సేకరించడం, డంపింగ్ యార్డుల్లో చెత్తను వేరు చేయడం, కంపోస్టు ఎరువు తయారీ చేపడుతున్నారు. నర్సరీ ల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు పల్లె ప్రగతి పనులను పర్యవేక్షిస్తున్నారు.
మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో పల్లె ప్రగతి పనుల్లో జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నారని అన్నారు. దత్తత గ్రామం గౌతోజిగూడెం లో స్వచ్ఛతపై అవగాహన కల్పించి, మహిళలతో కలిసి శ్రమదానం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీవో లక్ష్మీనర్సింహులు, ఎంపీపీ నవనీతారవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీలత, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు.
హవేళీఘనపూర్ మండలంలో లింగ్సాన్పల్లిలో పల్లె ప్రగతి పనులను ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్ మైపాల్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీరామ్, ఎంపీవో ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు.
మెదక్ మండలంలోని పాతూరులో యువకులు శ్రమదానం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ లింగమ్మ ఇంటింటికీ చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాల య్య, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాలన్నీ హరితమయంగా మారుతున్నాయని రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. కోనాపూర్, ఝాన్సీలింగాపూర్‌లో పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ జ్యోతి, ఎంపీవో గిరిజారాణి, కార్యదర్శి చంద్రహాస్, ఉప సర్పంచ్‌లు దీపక్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పంబాల శ్రీనువాస్, ఇమ్మానియేల్ ఉన్నారు. శివ్వంపేటలో పల్లెప్రగతి పనులను సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో చేప ట్టారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మవెంకటేశ్, వార్డుసభ్యులు పోచాగౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
చేగుంట, జూన్ 15 : పల్లె ప్రగతిలో పారిశుధ్య పనులు చేప ట్టాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్ అన్నారు. నార్సింగి మండలం జెప్తిశివునూర్లో పనులను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ షేక్ షరీఫ్, ఎంపీవో సతీశ్, ఉప సర్పం చ్ రేణుక, వార్డు సభ్యుడు పోచయ్య, కార్యదర్శి రాజు ఉన్నారు.