ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులను ఆదేశించారు. రామాయంపేటలో శుక్రవారం ఆయన పర్యటించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, వైకుంఠధామం నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి గర్భిణులు, కుటుంబసభ్యులకు సర్కారు వైద్యంపై అవగాహన కల్పించాలన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
– రామాయంపేట, మార్చి 3
రామాయంపేట, మార్చి 3 : గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పారదర్శకంగా అందించాలని, నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం రామాయంపేట పట్టణానికి చేరుకున్న కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి డబు ల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. అక్కడి నుంచి వైకుంఠధామం, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి ప్రభుత్వ పీహెచ్సీ దవాఖానను సందర్శించి, నూతనంగా నిర్మించిన మార్చురీ, ఎక్స్‌రే, శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు, కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో జిల్లా వ్యాప్తంగా నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తన్నామన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో గర్భిణులకు, వారి కుటుంబీకులు అవగాహన కల్పించాలని, సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బిడ్డ పుట్టిన వెంటనే కేసీఆర్ కిట్ అం దించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రభుత్వ దవాఖానలో ఎక్స్‌రే మిషన్ సౌకర్యాన్ని త్వరలోనే రోగులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య సిబ్బంది ఎన్సీడీ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. దవాఖానలోని మందుల స్టాక్ రిజిస్ట్రార్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నారు. రామాయంపేట ప్రభుత్వ దవాఖానలో మెరుగైన సేవలను కల్పించామని అందు కోసం ఓపీ సేవలను పెంచాలన్నారు. పట్టణంలోని 304 డబుల్ బెడ్రూంలను ప్రభుత్వం నిర్మించిందని, ఈ నెల 8వ తేదీలోగా పనులన్నీ పూర్తి చేసి అర్హులైన వారికి అందిస్తామన్నారు. ప్రస్తుతం డబుల్ బెడ్ రూం ఇండ్లలో నీటి సౌక ర్యం, సెప్టిక్ ట్యాంక్, మురుగు కాల్వలు, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ పనులను ముమ్మరంగా చేయాలన్నారు. కూలీలను అధిక సంఖ్యలో పెట్టుకొని నాణ్యతలో రాజీ పడకుండా అగ్రిమెంట్ ప్రకారం ఇండ్ల నిర్మాణాలను చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మండల కార్యాలయంలో నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్‌వెజ్ పనులు వేగంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయితీరాజ్ ఈఈ సత్య నారాయణ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కో- ఆర్డినేటర్ చంద్రశేఖర్, ప్రభుత్వ దవాఖాన సూపరిండెంటెండ్ లింబా ద్రి,మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, తహసీల్దార్ అబ్దుల్ మన్నన్, ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీనివాసరావు, డీఈ పాండురంగారెడ్డి, ఏఈ కుశాల్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, సుందర్‌సింగ్ ఉన్నారు.