మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 2 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగాణమంత కిటకిటలాడింది. భక్తులు ప్రార్థనల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రేసిబేటరీ ఇంచార్జి శాంతయ్య భక్తులనుద్దేశించి దైవసందేశం చేశారు.
ప్రభువైన యేసు అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ లోక రక్షకుడిగా ఉండి పరలోకం నుంచే తన దీవెనలను అందిస్తాడన్నారు. నమ్ముకున్న వారి గుండెల్లో దైవ సహాయకుడిగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన యేసయ్య భక్తి గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రార్థనల్లో చర్చి ఫాస్టర్లు డేవిడ్, శ్రీనివాస్, జైపాల్తో పాటు చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, జయరాజు సంశాన్ సందీప్, సువణ్ డగ్లస్, ప్రాంక్ జాన్సన్, ప్రభుదాస్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.