మెదక్ మున్సిపాలిటీ, మార్చి 14: ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగులుతుంటే స్పీకర్ వారిని నియంత్రించక లేకపోయారన్నారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై గొంతునొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్వవహరిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని అన్నారు. సభ నుంచి అక్రమంగా సస్పెండ్ చేసిన జగదీష్‌రెడ్డిపై జారీచేసిన ఆదేశాలను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.