పాపన్నపేట, అక్టోబర్ 28 : ‘కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కష్టాలు షురువైతయి.. కుర్చీ కోసం కొట్లాడే నాయకులకు ప్రజలను పట్టించునేంత టైం ఉంటదా.. గ్లాసులు, గిన్నెలు ఇస్తే జనం ఓటేస్త్తరా.. 13 ఏండ్లు కనబడకుండా పోయి, గిప్పుడొచ్చి ఓట్లేయమంటే వేస్తారా?.. ప్రజల గురించి నిత్యం ఆలోచించే సీఎం కేసీఆర్‌తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతది.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ఆయనదే’.. అని మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ మరింతగా అభివృద్ధి చెందాలంటే అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. శనివారం మెదక్ మండలంలోని రాయిన్‌పల్లి, తిమ్మనగర్, మాల్కాపూర్ తండా, శివాయిపల్లి, కోంటూరు, వెంకటాపూర్, పాషాపూర్, ఖాజీపల్లి తదతర గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. – పాపన్నపేట, అక్టోబర్ 28
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెం ట్ కష్టాలు మొదలవుతాయని బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ మండల పరిధిలోని రాయిన్‌పల్లి, తిమ్మనగర్, మాల్కాపూర్తాండ, శివ్యాయిపల్లి, కొంటూరు, వెంకటపూర్, పాషాపూర్, ఖాజీపల్లి, తదతర గ్రామాల్లో బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేవలం మూడు గంటల కరెంటు వస్తుందని దీంతో రాష్ట్రం అధోగతి పడుతుందని వెల్లడించారు. గతంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు. మైనంపల్లి హనుమంతురావు కొట్లాటలు పెట్టడం మల్కాజిగిరిలో నడుస్తదని, కానీ మెదక్ నియోజకవర్గంలో కుదరదన్నారు. ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటునట్లు చెప్పారు. మేము వచ్చి గొడవలు పెడాతం, కొట్లాటలు పెడ తాం అంటే ఊరుకోమని హెచ్చరించారు. 20 ఏండ్ల నుంచి మెదక్ ప్రజలతో నాకు అనుబంధం ఉందని తాను ఎమ్మెల్యే అయినప్పటికీ ఎవరిని ఇబ్బందులకు గురిచేయలేదన్నారు.
పల్లె పల్లెన ఘనంగా స్వాగతం
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థ్ధి పద్మాదేవేందర్ రెడ్డికి మెదక్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయ దుస్తులతో మాల్కాపూర్ తండాల్లో ఆమె ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి పాటలు పాడుతూ ఆడారు. ఎమ్మె ల్యే వెంట జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, ఎంపీపీ యమునా జయరాంరెడ్డి, వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కిష్టయ్య, హవేళీఘన్‌పూర్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు , సర్పంచ్‌లు సిద్ధ్దగౌడ్, సరోజామోహన్, మాధవి రవీందర్, లక్ష్మీ ఆంజనేయులు రాజ్యలక్ష్మీరవీందర్, స్వప్న సిద్ధ్దిరాములు నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక
ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో శివాయిపల్లి, కొంటూరు, గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలువురు బీఆర్ఎస్లో చేరారు.