మెదక్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణపై పోలీసు సిబ్బందికి ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ పలు సూచనలు చేశారు. పోలీసులు ప్రతి రోజూ వ్యాయామం చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో పనిచేయాలన్నారు.
శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై అవగాహన కూడా అవసరమని సూచించారు. చట్టం అందరికీ సమానంగా అమలులో ఉండేలా కృషి చేయాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. విధులను నిర్వర్తించే సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.