మెదక్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): ప్రజావాణిలో వివిధ సమస్యలతో ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిషరించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారులతో కలిసి ఆయన 72 అర్జీలు స్వీకరించి పరిశీలించారు.
ఈ సందర్భంగా వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు కేటాయి స్తూ ప్రజాసమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరగా పరిషరించేందుకు కృషిచేయాలని అధికారులకు సూచించారు. ధరణి -18, పింఛన్లు-4, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు-18, పంట రుణమాఫీ 7- ఇతర సమస్యలపై 25 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ ప్రజావాణిలో డీఆర్వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీ నిధుల దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడిన పంచాయతీ సెక్రటరీ, మాజీ సర్పంచ్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని తూప్రాన్ మం డలం ఇస్లాంపూర్ గ్రామస్తులు తిరుపతిరెడ్డి, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, గోపిరెడ్డి, రాజు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి తుపాకు ల కల్పన విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 14 లోని ప్రభుత్వభూమిలో ఇండ్లు నిర్మిస్తూ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉపాధి హామీ పథకం పనుల్లో 2020 నుంచి 2024 వరకు అవకతవకలు జరిగాయని, మాజీ సర్పంచ్ జంగం సుకన్యారమేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ కుమ్మరి నర్సింహులుతో కుమ్ముకై ఉపాధి పనులు చేయని వారి ఖాతాల్లో కూలీ డబ్బు లు జమ చేయించి వారి నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.
వాటర్ ట్యాం కర్తో చెట్లకు నీరు పోయించినట్లు తప్పుడు రికార్డులు రాసి బిల్లులు తీసుకున్నారని, వారు నీరు పోసినట్లు చూపించిన స్థలంలో ఇప్పుడు అసలు చెట్లే లేకపోవడం గమనార్హమన్నారు. ఇస్లాంపూర్ గ్రామ పార్క్‌ను ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన చందాలతో నిర్మించి ప్రభుత్వం నుంచి బిల్లులు పొందారని ఆరోపించారు. మాజీ సర్పంచ్ సుకన్యారమేశ్, పంచాయతీ కార్యదర్శి తుపాకుల కల్పన కలిసి ప్రభుత్వం నుంచి వచ్చిన పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిం చారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.