
దౌల్తాబాద్, జూన్ 28 : పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేదలకు వరంలా మారాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ అన్నారు. సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీపీ గంగాదరి సంధ్య, జడ్పీటీసీ రణం జ్యోతితో కలిసి 48 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉం టుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ నీలిమ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఆది వెంకన్న, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు రహీమొద్దీన్, ఎంపీటీసీ ఆది వనిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రమేశ్, అంజి, టీఆర్ఎస్ నాయకులు మోహన్‌రావు, ముత్యాల శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
మండల కేంద్రానికి చెందిన సీఆర్పీ చంద్రమౌళి కొడుకు సోమవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. విషయం తెలుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత..
ఆయా గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ, ఎమ్మెల్సీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నదన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
షాదీఖాన పరిశీలన..
దౌల్తాబాద్‌లో ముస్లింల కోసం నిర్మిస్తున్న షాదీఖానను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ముస్లింలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.