అభివృద్ధి జోరు…
రూ.1.15 కోట్లతో జిన్నారం ప్రధాన రోడ్డును డబుల్‌గా నిర్మించారు. రెండు వైపులా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. జిన్నారం, పెద్దమ్మగూడెం, నర్రిగూడెం గ్రామాల్లో రూ.70 లక్షలతో సీసీరోడ్లు, రూ.15లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. ఇప్పటి వరకు పంచాయతీలో 85శాతం సీసీరోడ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం జిన్నారం ప్రధాన రోడ్డుకు హెటిరో పరిశ్రమ సౌజన్యంతో పంచాయతీ భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. పంచాయతీకి నెలనెలా ఆదాయం సమకూర్చేందుకు రోడ్డుకు ఉన్న పోలీస్‌స్టేషన్, దవాఖాన ప్రహరీలను దూరంగా నిర్మించారు. పంచాయతీ నుంచి 21 షెట్టర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిన్నారం శివారులో రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదికకు అదనంగా మరో రూ.8లక్షలు ఖర్చు చేసి నిర్మించారు. ఎకరా స్థలంలో పంచాయతీ నిధులు రూ.10లక్షలతో పార్కు నిర్మించారు. జిన్నారం, పెద్దమ్మగూడెం, నర్రిగూడెం గ్రామాల్లో 150 కొత్త కరెంటు స్తంభాలు, కొత్త వైరింగ్ ఏర్పాటు చేశారు. జిన్నారం నుంచి గరీబ్షావళి దర్గా వరకు రోడ్డుకు రెండు వైపులా వీధిదీపాలను ఏర్పాటు చేశారు. జిన్నారంలో ఎకరా స్థలంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సహకారంతో గోషాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.55లక్షలతో జిన్నారంలో హనుమాన్ ఆలయం నిర్మించారు. పల్లెప్రకృతి వనంలో ఆర్గానిక్ పద్ధ్దతుల్లో టమాట, వంకాయ తదితర మొక్కలను పెంచుతున్నారు. జిన్నారంలో ఐదు ఎకరాల్లో నిర్మించే మినీ స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తియ్యాయని ఎమ్మెల్యే సహకారంతో పనులు త్వరలోనే ప్రారంభిస్తామని సర్పంచ్ తెలిపారు. పెద్దమ్మగూడెం గ్రామస్తుల కోసం వైకుంఠధామం నిర్మించేందుకు ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు. జిన్నారం పంచాయతీకి మొదటి విడుత కింద 60 ఇండ్లు మంజూరు కాగా, పనులు ప్రారంభమయ్యాయి.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా..
జిన్నారం పంచాయతీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, అధికారులు, గ్రామస్తుల సహకారంతో ఇప్పటికే గ్రామంలోని ప్రధాన పనులు పూర్తయ్యాయి. సమస్యలు పరిష్కారమవుతున్నాయి. పంచాయతీలో 85శాతం సీసీరోడ్లు పూర్తయ్యాయి. మిగిలిన రోడ్లను పూర్తిచేస్తాం. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 21 షెట్టర్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఆ పనులు త్వరలోనే ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. హెటిరో పరిశ్రమ సహకారంతో గ్రామంలో నిర్మిస్తున్న పంచాయతీ భవనం త్వరలోనే పూర్తిచేస్తాం.
ఇవీ కూడా చదవండి…
రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
షాక్: భారీగా తగ్గిన చమురు యూసేజ్.. 1999 తర్వాత..