
వర్గల్, సెప్టెంబర్ 30 : రాష్టంలో గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయడమే కాకుండా కులవృత్తులకు ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కొత్తకుంటలో ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లను ఎంపీపీ లత గౌడ్, జడ్పీటీసీ బాలమల్లు యాదవ్‌తో కలిసి కుంటలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ మాట్లాడారు. మండలంలోని 10 గ్రామాలకు గానూ 6 పెద్ద చెరువులతో పాటు 80 కుంటల్లో 6లక్షల 10వేల చేపలను వదిలామన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరగడంతో వ్యవసాయం, మత్స్యసంపద లాభసాటిగా మారిందన్నారు. అనంతరం ఆయా గ్రామాల మత్స్యకారులకు చేపపిల్లలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతుబంధు సమితి చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ వర్గల్ మండల అధ్యక్షుడు నాగరాజు, ప్యాక్స్ చైర్మన్ రామకృష్ణా రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
హత్నూర, సెప్టెంబర్ 30 : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ం కృషి చేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. గురువా రం మండల కేంద్రమైన హత్నూర, సికింద్లాపూర్, మంగాపూర్, కాసా ల, బోర్పట్ల, రెడ్డిఖానాపూర్ గ్రామాల్లోని చెరువుల్లో 8లక్షల 84వేల చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. అంతకు ముందు హత్నూర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, డైరెక్టర్లు దామోదర్‌రెడ్డి, దుర్గారెడ్డి, కృష్ణ, సర్పంచ్ వీరస్వామిగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి సతీశ్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీశైలం, అసిస్టెంట్ మౌనిక, నాయకులు రవి, కిష్టయ్య, నరేందర్, బుచ్చిరెడ్డి, ఆంజనేయులు, రాములు, ధనుంజయ, జనార్దన్, ప్రవీణ్‌గౌడ్ పాల్గొన్నారు.