సంగారెడ్డి జూన్ 25(నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్‌ను గురువారం ప్రభుత్వం సైబరాబాద్ డీసీగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో బ్రూవరేజస్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.చంద్రయ్యను ఉద్యోగోన్నతిపై ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా నియమించింది. చంద్రయ్య గురువారం బాధ్యతలు స్వీకరించగా, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌చంద్ర ఉద్యోగోన్నతిపై బ్రూవరేజస్ డైరెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్‌రావు ఉద్యోగోన్నతపై సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించగా, ఎక్సైజ్ సీఐలు, ఇతర అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.మణెమ్మ వరంగల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగోన్నతిపై వెళ్లారు.