మర్కూక్,జనవరి 5: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదివారం మర్కూక్ మండలానికి చెందిన బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు, సేవారత్నం అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య, నాయకులు రాజేశ్వర్‌రావు, అప్పాల భాస్కర్, పిట్టల రాజు, కృష్ణ కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో గ్రామస్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరినీ కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని కేటీఆర్ వారికి సూచించినట్లు నాయకులు తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని కేటీఆర్ సూచించినట్టు కనకయ్య తెలిపారు.