రామచంద్రాపురం,జూలై 12: సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని జాతీయరహదారికి పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్‌ను ఆదివారం సినీతార రాశీఖన్నా షాపింగ్ మాల్ యజమాని కాసం నమశివాయతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆర్సీపురం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మాంగళ్య షాపింగ్‌మాల్ 30వ షోరూమ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని రాశీఖన్నా అన్నారు. ఒకే చోట అన్నిరకాల ఆధునిక వస్ర్తాశ్రేణిని అందుబాటులోకి తేవడం అభినందనీయమని కొనియాడారు.
అనంతరం మాంగళ్య షోరూం యజమాని కాసం నమశివాయ మాట్లాడుతూ.. ఆర్సీపురం పరిసర ప్రాంత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అన్నివర్గాల వారికి అందుబాటు ధరలతో సరికొత్త కలెక్షన్స్‌తో వస్ర్తాలు మాంగళ్యలో ఉన్నాయని తెలిపారు. రూ.100 నుంచి రూ.4లక్షల ఖరీదైన వస్ర్తాలు తమ వద్ద విక్రయిస్తున్నట్లు చెప్పారు. నాణ్యతతో కూడిన వస్ర్తాలను అందించడమే మాంగళ్య షాపింగ్‌మాల్ ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ పుస్పానగేశ్ తదితరులు పాల్గొన్నారు.