మెదక్ జిల్లాలోని మంభోజిపల్లి గ్రామంలో ఛత్తీస్‌గఢ్ వాసి మృతిచెందాడు. చిట్యాలకు వెళ్లే దారిలో ఖాళీ స్థలంలో వ్యక్తి మృతదేహం కనిపించిందని మెదక్ రూరల్ ఎస్సై మురళి తెలిపారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనిల్‌కుమార్ (26) ఉపాధి కోసం మెదక్ మండలానికి వచ్చాడు. ఇక్కడ కొద్దిరోజులు వెల్డింగ్ పనిచేశారు. అలా వచ్చిన డబ్బుతో మద్యం సేవించి జులాయిగా తిరుగుతుండే వాడు. ఈ క్రమంలో ఉపాధి లేక నాలుగు రోజులుగా తిండి, నిద్ర లేకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడిని ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.