Medak | ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయం: మామిళ్ల ఆంజనేయులు
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు.
మెదక్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా చాటి చెప్పిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం పోరాడిన ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. “మన నీళ్లు – మన నిధులు – మన ఉద్యోగాలు” అనే నినాదంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించి, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కో-కన్వీనర్ గడ్డమీది కృష్ణ గౌడ్, కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు ఏనుగుల రాజు, ఇస్మాయిల్, సునీల్, బబ్లు, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

