పాపన్నపేట : విద్యా శాఖ చేపట్టిన బడిబాట (Badibata) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి (MEO Pratap reddy) కోరారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలను , నాణ్యమైన విద్య గురించి అందరికీ తెలియజేసి విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలకు చెందిన దృశ్య సంచిక , కరపత్రాలను, లఘు వీడియోను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ , మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ , నాయకులు శ్రీకాంతప్ప , నరేందర్ గౌడ్ ,ఈవో నయీమ్ ఉపాద్యాయులు అంజా గౌడ్, రజిత, పద్మ, లక్ష్మి నాగరాజు, లింగప్ప, మంగ నరసింహులు, రమేష్, యాదయ్య, రియాజ్, మోహన్ రావు , అంగన్వాడీ ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.